మే 2 న ఫోన్లలో పెద్ద శబ్దం.. భయపడొద్దంటున్న కేంద్రం....
మే 2 న ఫోన్లలో పెద్ద శబ్దం.. భయపడొద్దంటున్న కేంద్రం....
దేశవ్యాప్తంగా మే 2న ఫోన్లలో ఒక్కసారిగా పెద్ద సైరన్ లాంటి శబ్దం వినిపిం
చనుందని, దీని గురించి దేశ ప్రజలు భయపడి, కంగారు పడాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఏదైనా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు అంటే, వరదలు, తుఫానులు, భూకంపాలు లాంటివి వచ్చినప్పుడు, ప్రజలందరినీ ఒకేసారి అప్రమత్తం చేయడానికి ప్రభుత్వం 'సాచెట్' (SACHET_ అనే కొత్త సిస్టం తయారు చేసింది. ఇది సరిగ్గా పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి టెలికమ్యూనికేషన్ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) కలిసి ఈ పరీక్షను నిర్వహిస్తున్నాయి.
దీనిలో భాగంగానే మీ ఫోన్ కి ఒక మెసేజ్ వస్తుంది. దాంతో పాటు పెద్ద సైరన్ శబ్దం వినిపిస్తుంది. ఇది కేవలం ఒక 'టెస్ట్' మాత్రమే. ఈ మెసేజ్ లేదా శబ్దం అత్యవసర హెచ్చరిక వ్యవస్థ Common Alerting Protocol (CAP) ఆధారంగా పనిచేస్తుంది. అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) సిఫార్సు చేసిన ఈ టెక్నాలజీ ప్రస్తుతం దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమల్లో ఉంది.
దీని ద్వారా ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నప్పుడు సెకన్ల వ్యవధిలో వేలమందికి సమాచారం చేరుతుంది. ప్రమాదం ఉన్న ప్రాంతంలో ఉన్న ఫోన్లకు మాత్రమే ఈ మెసేజ్ లు వెళ్లేలా ఈ టెక్నాలజీని రూపొందించారు.
Comments 0