చెవుడికి ఇక సెలవు ఈ ఇంజక్షన్ తో!
చెవుడికి ఇక సెలవు ఈ ఇంజక్షన్ తో!
చెవుడికి ఇక సెలవు ఈ ఇంజక్షన్ తో! ఈ ప్రకృతి లో అద్భుతమైన జీవి మనిషి. కనులతో చూస్తాడు. చెవులతో వింటాడు. నోటితో మాట్లాడతాడు. ముక్కుతో ప్రకృతి లో వికసించే సువాసనలను పరిచయం చేసుకుంటాడు. తనువుతో స్పందనను కలిగి ఉంటాడు. ఇలా పంచంద్రియాలతో పంచభూతాలతో ఏకమైనది మనిషి జీవితం. కానీ జన్యు లోపాల వలన, అనుకొని ప్రమాదాల వలన మనిషి తన శరీరంలో కొన్ని అవయవాలను కోల్పోతుంటాడు. కొంతమంది అయితే పుట్టుకతోనే చెవిటి వారిగా, మూగ వారిగా, గుడ్డి వారిగా ఈ భూమి మీదకి వస్తుంటారు. ఇలాంటి వారికోసం చరిత్ర పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు వీరికి ఉన్న వైకల్యాలను సరిదిద్దడానికి ఎన్నో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి క్రమంలో కొత్తగా వైద్య రంగంలో ఒక ఇంజక్షన్ ను కనుగొనడం జరిగింది. ఇది పుట్టుకతో చెవుడు ఉన్నవాళ్లకి ఒక వరం అని చెప్పుకోవచ్చు. OTOF (Otoferlin) అనే జన్యులోపం వలన చాలామంది పిల్లల్లో పుట్టుకతోనే చెవుడు వస్తుంది. దీనితో వీరు దీనికి శక్తిని పూర్తిగా కోల్పోతారు. చెవిలో మెదడుకు శబ్దాన్ని చేరవేసే కణాలు ఉంటాయి. జన్యులోపం వలనఈ కణాలు "ఓటోఫెర్లిన్" అనే ప్రోటీన్ ను ఉత్పత్తి చేయలేవు. కాబట్టి జీన్ థెరపీ ద్వారా ఒక కొత్త OTOF జన్యువును చెవిలోకి ఒక్క ఇంజెక్షన్ (Single Injection) రూపంలో పంపుతారు.దీని వలన సహజమైన వినికిడి శక్తి మొదలవుతుంది. OTOF (Otoferlin) అనే జన్యులోపం వల్ల వినికిడి శక్తి లేనివారికి ఈ చికిత్స మంచి ఫలితాలను ఇస్తుంది. ఇప్పటికే చైనా, యూరప్ లో జరిగిన క్లినికల్ ట్రయల్స్ లో ఈ చికిత్స ను పొందిన వారిలో 90% మందికి వినికిడి శక్తి మెరుగుపడిందని, కొంతమంది అడల్ట్స్ లో కూడా మంచి ఫలితాలు కనిపించాయని, అంతేకాదు, చికిత్స పొందిన కొద్ది వారాల్లోనే, కొంతమంది పిల్లలు సాధారణ శబ్దాలను వినడం ప్రారంభించారని, 7 సంవత్సరాల చిన్నారి కూడా సహజంగా మళ్లీ వినగలిగిందని డాక్టర్స్ వివరించారు. ఈ చికిత్స కోక్లియర్ ఇంప్లాంట్స్ కంటే భిన్నంగా ఉంటుంది. కోక్లియర్ (Cochlear Implants) లో పరికరాల ద్వారా వినికిడిని ఇస్తే, ఈ జీన్ థెరపీ లో జన్యులోపాన్ని సరిచేసి సహజమైన పద్దతిలో చికిత్స ను అందిస్తారు. పుట్టుకతో చెవుడుతో బాధపడే వేలాది మంది పిల్లలకు, పెద్దలకు ఈ జీన్ థెరపీ ఒక వరం అని చెప్పవచ్చు. 2026లో, Regeneron Pharmaceuticals చేసిన ఈ OTOF జీన్ థెరపీకి అమెరికా FDA ఆమోదం తెలిపింది. ఈ చికిత్సను 'Otarmeni” అని పిలుస్తున్నారు. Krupadevi ch (sr content producer )
Comments 0