లెక్కల తప్పులు, విద్యార్థికి మార్కుల తిప్పలు!
లెక్కల తప్పులు, విద్యార్థికి మార్కుల తిప్పలు!
కె. అంకిత. బెంగుళూరు కు చెందిన విద్యార్థి.
చిక్కనాయకనహళ్లి తాలూకా, మేలనహళ్లిలోని కిత్తూరు రాణి చెన్నమ్మ రెసిడెన్షియల్ స్కూల్ లో చదువు కుంటుంది. పేద కుటుంబం. అంకిత తండ్రి మరణించాడు, తల్లి గార్మెంట్స్ లో పనిచేస్తూ చదివిస్తోంది. చదువే ఆధారం. మంచి మార్కులు తెచ్చుకోవాలన్న తపన తో కష్టపడి చదివింది. కానీ, తప్పు ఒకరిది అయితే, శిక్ష మరొకరికి అన్నట్టు, అంకిత పేపర్ దిద్దిన మాస్టారు చేసిన తప్పు ఆమెకి ఒక శాపం గా మారింది. ఇటీవల విడుదలైన ఎస్ఎస్ఎల్సీ ఫలితాలలో అంకితకు కన్నడలో 87 మార్కులు వస్తే, ఆ మాస్టారు 47 మార్కులు వేసాడు.
కన్నడ సబ్జెక్టు లో అంకిత కు ఉన్న ప్రావీణ్యత గురించి తెలిసిన ఆమె పాఠశాల ఉపాధ్యాయులు, మార్కుల షీటును పరిశీలించగా, ఆమె రాసిన సమాధానాలకు వచ్చిన మార్కులను కలిపితే, మొత్తం 87 మార్కులు వచ్చాయి. కానీ, ఆ విద్యార్థి పేపర్ ను మూల్యాంకనం చేసిన మాస్టారు ఎవరో కానీ 47 మార్కులను వేసాడు. ఎంత అన్యాయం. నమ్మకం అనే మాటకే అర్ధం లేకుండా పోతుంది. మానవ విలువలు స్వార్థం, నిర్లక్ష్యం అనే ఎండలకు ఆవిరై పోతున్నాయి.
29/04/2026
K life
Krupadevi sr content editor
Comments 0