ఆ మధుర స్వరం.. మౌనమైంది.. (ఎస్. జానకి gaaru)🙏
ఆ మధుర స్వరం.. మౌనమైంది.. (ఎస్. జానకి gaaru)🙏
ఆమె గాత్రం భావోద్వేగాల కలయిక…
ఆమె స్వరం మధుర రాగాల వేడుక.
ఆమె ఎవరో కాదు...గానకోకిల ఎస్. జానకి గారు. ఇప్పుడు ఆ మధుర స్వరం ఒక జ్ఞాపకమైయింది.ఒక్కసారిగా భారత సంగీత ప్రపంచం మౌనమైయింది. అయినా,
ఆమె పాటలు తరతరాలకు తరిగి పోని గాన సంపద. ప్రతి పాటను తన స్వరం తో మాయచేసి, సంగీత అభిమానుల గుండెలలో
ఒక ధ్రువ తారగా నిలిచారు.
సిరిమల్లె పువ్వా... అంటూ పలకరించిన
మౌనమేలనోయి ఈ మరుపురాని రేయి..అంటూ
తన స్వరాన్ని వినిపించిన
మానసా తుల్లి పడకే, అతిగా ఆశ పడకే అంటూ అలరించినా..
అందాల లో అహో మహోదయం... అంటూ..అమాయకాన్ని కుమ్మరించిన
ప్రియతమా.. నా హృదయమా.. అంటూ తేనెలు కురిపించి...
మాటే మంత్రము.. మనసే బంధము అంటూ అభిమానుల గుండెలలో నిలిచిన..
గున్న మామిడి కొమ్మ మీద గూళ్లు రెండున్నాయి అని స్నేహానికి ఊపిరి పోసి, జాబిల్లి కోసం ఆకాశమల్లే...అని పాడిన ఆ మధుర స్వరం..ఆ ఆ జాబిలి వెన్నెల ఒడి చేరింది.
తన మధురమైన స్వరంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు. ❤️
48 వేలకు పైగా పాటలు పాడి, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ వంటి అనేక భాషల్లో తన ప్రతిభను చూపించి, ఎన్నో
జాతీయ పురస్కారాలను అందుకున్నారు.
Krupadevi chintha
Sr. Contet producer.
Comments 0