గ్యాస్, ఎసిడిటీ లాంటి సమస్యలు వేధిస్తున్నాయా? ఇలా చేయండి...
గ్యాస్, ఎసిడిటీ లాంటి సమస్యలు వేధిస్తున్నాయా? ఇలా చేయండి...
మన లైఫ్ స్టైల్ మారిపోయింది. దానితో పాటు అనారోగ్య సమస్యలు కూడా వాటి రూట్ ను మార్చుకున్నాయి. ఈ మధ్య కాలంలో గ్యాస్, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ సమస్యల తో ఎక్కువ మంది బాధపడుతున్నారు. దీనికి కారణాలు చాలా ఉన్నప్పటికీ ముఖ్యమైన కారణం శారీరక శ్రమ తక్కువ కావడం. అలాగే
మెదడుకి కి తగిన విశ్రాంత్రి లేకపోవడం. ఇంకా కంప్యూటర్ ముందు గంటలు గంటలు వర్క్ చేయడం. అంతకంటే ఇంపార్టెంట్ విషయం మనం తీసుకునే ఫుడ్ పైన అవగాహన లేకపోవడం. ఆకలి అవుతుంది కదా అని ఎదో ఒక జంక్ ఫుడ్ ని తినడం. ఆ తరవాత బాధ పడడం చేస్తుంటాం.రోజువారీ అలవాట్లలో స్వల్ప మార్పులను చేసుకోవడం ద్వారా ఇలాంటి సమస్యల నుండి ఉపశమనం పొందడం సాధ్యమే నని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
అదేవిధంగా, ప్రతిరోజూ ఉదయం నిద్ర లేవగానే పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగడం అలవాటు శరీరంలో పేరుకు పోయిన విష పదార్థాలు సులభంగా బయటకు పోతాయి.
అంతేకాదు జీర్ణక్రియ కూడా సులభం అవుతుంది.వీటితో పాటు యోగా చేయడం కూడా అలవాటు చేసుకోవాలు. దీనిలో ఎక్కువగా వజ్రాసనం, బాలాసనం వంటి ఆసనాల ద్వారా శరీరం తేలిక అయి గ్యాస్, అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుందని
ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు.
ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కి ముందు ఒక గ్లాస్ జీలకర్ర నీరు, కొత్తిమీర నీరు వంటి హెర్బల్ పానీయాలను తీసుకోవడం వలన
జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుందని, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్య ల నుంచి ఉపశమనం కలుగుతుందని వైద్యులు తెలుపుతున్నారు.
krupadevi sr. content producer
Comments 0